Abn logo
Sep 27 2021 @ 00:23AM

నేటి బంద్‌ను జయప్రదం చేయండి

ధర్మవరంలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులు

ధర్మవరం, సెప్టెంబరు 26 : ప్రధాని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం తలపెట్టిన దేశ వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధఽ్యక్షుడు పోలారామాంజినేయులు, సీపీఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం వారు సీఐటీయూ,  రైతు సంఘాల నాయకులతో కలిసి పట్టణంలో బంద్‌కు సంబంధించిన కరపత్రాలను పంపిణీ  చేశారు. వారు మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచి రూ.30 కోట్ల అదనంగా ప్రజలపై భారమోపారన్నారు. కార్పొరేట్‌ సంస్థలు లబ్ధిపొందేలా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌హెచబాషా, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, అయూబ్‌ఖాన, ఎల్‌ ఆదినారాయణ, రైతుసంఘం మండల అధ్యక్షుడు కొత్తకోట మారుతి, ఎస్‌ఎ్‌పఐ జిల్లా అధ్యక్షుడు నాగార్జున  పాల్గొన్నారు.


టీడీపీ మద్దతు :  సోమవారం తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు పట్టణంలోని గాంధీనగర్‌ సర్కిల్‌ నుంచి పలుపార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను పూర్తీ స్థాయిలో బంద్‌ చేయించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. దీన్ని బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.


కదిరిఅర్బన : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్‌కోడ్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ నిత్యావసర సరుకుల ధరలు పెంపును నిరసిస్తూ సోమవారం చేపట్టే భారతబంద్‌ను జయప్రదం చేయాలంటూ సీపీఎం నాయకులు ఆదివారం నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రైల్వే, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స, బీఎ్‌సఎనఎల్‌, విశాఖ ఉక్కులాంటి ప్రభుత్వ రంగ సం స్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సుబ్బిరెడ్డి, జీఎల్‌ నరసింహులు, సీఐటీయూ నాయకులు జగనమోహన, హరినాథ్‌రెడ్డి, ముస్తక్‌, రామ్మోహన, ఫైరోజ్‌, రామాంజి పాల్గొన్నారు. 


 బీఎస్పీ మద్దతు : భారతబంద్‌కు బహుజన సమాజ్‌ పార్టీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ నాయకులు షేక్‌ ఇర్ఫాన, గంగులప్ప, సురేంద్రనాథ్‌, బెనర్జీ తదితరులు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు  మద్దతు తెలుపుతున్నామన్నారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విద్యావంతులు, కార్మిక, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.  

 

కదిరిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు