Abn logo
Sep 24 2021 @ 00:45AM

దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయండి

వామపక్షాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

ధర్మవరం, సెప్టెంబరు 23: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ  27న తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. రైతు నల్లచట్టాలను రద్దుచేయాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ఢిల్లీలో చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బైకు ర్యాలీని ఏపీచేనేత కార్మికసంఘంరాష్ట్ర అధ్యక్షుడు పోలారామాంజినేయులు, సీపీఎం జిల్లాకమిటీ సభ్యులు ఎస్‌హెచ్‌ బాషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ సీపీఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం  పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, జిల్లాకమిటీసభ్యులు ఎస్‌హెచ్‌బాషా, రైతుసంఘం మండల అధ్యక్షుడు కొత్తపేట మారుతి, సీఐటీయూ జిల్లాసహాయ కార్యదర్శి జేవీరమణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు అయూబ్‌ఖాన్‌, ఎల్‌ ఆదినారాయణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధికారిప్రతినిధి చిన్నూర్‌ విజయ్‌ చౌదరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎన్‌ఎస్‌యూఐనాయకులు ప్రసాద్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు అశోక్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేళగాళ్ల వెంకటేశ్‌, నాయకులు సిద్దేరమణ, రఫీ, దస్తగిరి, కిరణ్‌, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.