Sep 21 2021 @ 18:07PM

సమంత పెదవి విప్పాలి!

కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా చై–సామ్‌ల విడాకులు గురించే చర్చ. సామ్‌ సోషల్‌ మీడియాలో పేరు మార్చినది మొదలు ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. ఆ విషయం మినహా అన్ని విషయాల్లోనూ సమంత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. విడాకులు చర్చ గురించి మాత్రం ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. తను చేసే ఎంజాయ్‌మెంట్‌ను మాత్రం మిస్‌ కావడం లేదు. ఇటీవల గోవా ట్రిప్‌ వేశారు. చెన్నైలో స్నేహితులతో సరదగా గడిపారు. జిమ్‌తో కసరత్తులు చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గతంలో లాగా చైకి సంబంధించిన ఏ విషయాన్ని షేర్‌ చేయట్లేదు. ‘సమంత పెదవి విప్పాలి’ అని నెటిజన్లు ప్రశ్నించినప్పటికీ చైతన్యకు సంబంధించి ఏ విషయాన్ని ఆమె మాట్లాడడం లేదు. ఏయన్నార్‌ జయంతి సందర్భంగా విడుదలైన ‘బంగార్రాజు’ లుక్‌ చూసి సామ్‌ విష్‌ చేయడం చూస్తుంటే అక్కినేని కుటుంబంతో పూర్తిగా మనస్పర్థలు లేనట్లు అనిపిస్తోంది. అయితే ఏం జరిగింది.. ఏం జరగబోతోంది అనేది ఆ కుటుంబ సభ్యులక, చై–సామ్‌లకే తెలియాలి. తాజాగా త్రిష, కీర్తి సురేశ్‌, కల్యాణి ప్రియదర్శన్‌లను కలిసి సరదగా గడిపారు సమంత.