సాగుకు సంకటం!

ABN , First Publish Date - 2021-06-19T05:46:56+05:30 IST

వరుసగా రెండో ఏడాదీ.. కరోనా పరిస్థితుల నడుమనే వానాకాల పంట సాగు పనులను ప్రారంభించడంతో వ్యవసాయ సాగుకు సంకటంగా మారుతోంది. యాసంగి లో పండించిన పంటల కొనుగోలు పూర్తికాక పోవడం, పెట్టుబడుల కోసం ఎదురు చూడాల్సి వస్తోది.మొత్తం పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం కింద నగదును అందజేస్తున్నా అవి ఏ మూలాన సరిపోవడం లేదంటున్నారు.

సాగుకు సంకటం!

కరోనా దెబ్బకు అన్నదాతల అతలాకుతలం

కొనేందుకు, అమ్మేందుకు కరువవుతున్న పశువులు

ట్రాక్టర్ల వినియోగంతో పెరుగుతున్న భారం

సెంచరీకి చేరువలో డీజిల్‌ ధరలు

జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో అధ్వాన పరిస్థితులు

ఆదిలాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): వరుసగా రెండో ఏడాదీ.. కరోనా పరిస్థితుల నడుమనే వానాకాల పంట సాగు పనులను ప్రారంభించడంతో వ్యవసాయ సాగుకు సంకటంగా మారుతోంది. యాసంగి లో పండించిన పంటల కొనుగోలు పూర్తికాక పోవడం, పెట్టుబడుల కోసం ఎదురు చూడాల్సి వస్తోది.మొత్తం పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం కింద నగదును అందజేస్తున్నా అవి ఏ మూలాన సరిపోవడం లేదంటున్నారు. సబ్సిడీ విత్తనాలను ఎత్తి వే యడం, ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడి ఖర్చుల భారం పెరిగి పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వానాకాల పంటల సా గుకు సన్నద్ధం ఇందులో భాగంగానే పశువులను కొన డం, అమ్మడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పశువులను అమ్మగా వచ్చిన ఆదాయాన్నే పెట్టుబడి ఖర్చులకు వాడుకుంటారు. కానీ వరుసగా రెండేళ్లుగా వానాకాల పంటల సాగుకు ముందు కరోనా ఉధృతి పెరగడంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం, పశువుల సంతాలను రద్దు చేస్తూ వస్తున్నారు. దీంతో అక్కడక్కడ గ్రామాల్లోనే పశువుల సంతలను నిర్వహిస్తున్న బహిరంగంగా సంతలను ఏర్పాటు చేయక పోవడంతో రైతులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ గ్రామాల్లో సాగు పనులకు పశువు లు అందుబాటులో లేక సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల ఇంద్రవెల్లి మండలం డొంగ్రా వ్‌ గ్రామంలో కొనుగోలు చేసేందుకు కాడెద్దు దొరకక పోవడంతో ఓ రైతు తన కన్న కొడుకునే కాడెద్దుగా మార్చిన వైనం దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. అయినా ఐటీడీఏ అధికారులు కదిలినట్లే కనిపించడం లేదు. అనాధిగా పశువుల పైనే ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అలాగే ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న రైతులకు ఇంధన ధరలు చుక్కలు చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు చేయడమే దండగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాడెద్దులకు భారీ డిమాండ్‌..

ఏటా వానాకాల సీజన్‌కు ముందుకు సాగుకు అవసరమైన పశువులను కొనుగోలు చేయడం, వయస్సు మీద పడిన పశువులను అమ్మేసుకోవడంతో పశువుల సంతాలు సందడి సందడిగా కనిపించేవి. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఎవరు కొనుగోలు, అమ్మేందుకు ముందుకు రాక పోవడంతో ఫశువుల సంతాలపై ప్రభావం పడుతుంది. జిల్లాలో ఆదిలాబాద్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, ఇచ్చోడ, బోథ్‌, నార్నూర్‌ మండలాల్లో  గతంలో పెద్ద ఎత్తున పశువుల సంతాలను నిర్వహించే వారు. ప్రతీ మండలంలో ఒక్కోవారం ఒక్కో సంతను నిర్వహించడంతో రైతులు సంతలకు వెళ్లి తమకు ఇష్టమొచ్చిన కాడెద్దులను కొనుగోలు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేక పోవడంతో గ్రామాల్లోనే అందుబాటులో ఉన్న పశువులతో సాగు పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కాడెద్దులకు భారీ డిమాండ్‌ పెరుగుతోంది. వర్షాలు మొదలు కావడంతో రైతులందరు ఒకేసారి సాగు పనులు చేపడుతున్నారు. ఎందుకంటే చేతిలో ఉన్న విత్తనానికి, భూమిలో పడ్డ విత్తనానికి ఎంతో తేడా ఉంటుందనే భావనతో  విత్తనాలు వేసేందుకు అన్నదాతలు ఆరాట పడుతున్నారు. కానీ గ్రామాల్లో కాడెద్దుల సంఖ్య భారీగా తగ్గి పోవడం, ఒక్కో గ్రామాల్లో పది అరకల లోపే పశువులు ఉండడంతో డిమాండ్‌ పెరుగుతోంది. రోజుకు అద్దె రూ.2వేల నుంచి రూ.3వేల వరకుపెరగడంతో ఉన్నంతలోనే సరిపెట్టుకుంటు సాగు పనులు చేపడుతున్నారు. సమయానికి కాడెద్దులు దొరకక పోవడంతో విత్తనాలు వేయడం కూడా ఆలస్యమవుతుందని రైతులు వాపోతున్నారు.

పెరిగిపోయిన ట్రాక్టర్‌ అద్దెలు..

విత్తనాలు వేసేందుకు కాడెద్దులు అందుబాటులో లేని రైతులందరు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. అసలే జోరుగా ఈజన్‌ పనులు ఊ పందుకోవడంతో భారీగా ట్రాక్టర్‌ అద్దెలను పెంచేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే డీజిల్‌ ధరలు భారీగా పెరిగి పోయాయని యజమానులు సమాధానమిస్తున్నారు. గతంలో గంటకు రూ.700 ఉన్న కల్టివేటర్‌ ధరలు ఈ యేడు రూ.900 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. విత్తనాలు వేసే సమయంలో కల్టివేటర్‌, రోటావేటర్‌లతో నేలను చదును చేసి విత్తనాలను విత్తుకుంటే మొలక శాతం అధికంగా ఉంటుంది. కానీ పెరిగిన అద్దె ధరలతో ఎక్కువ మంది రైతులు నేరుగానే విత్తనాలను వేసుకుంటున్నారు. గురువారం జిల్లాలో లీటర్‌ డీజిల్‌ ధరలు రూ.97.6పైసలు ఉండగా పెట్రోల్‌ ధర రూ.102.48 పైసలకు చేరింది. మరో కొన్ని రోజుల్లోనే డీజిల్‌ ధరలు సెంచరి కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.102.48 పైసలకు చేరింది. పెట్రోల్‌ ధరల బాటలోనే డీజిల్‌ ధరలు పెరిగి పోవడంతో అన్నదాతలపై మోయలేని భారం పడుతోంది. కొన్ని సంద ర్భాల్లో యంత్రాల సహాకారం లేకుండానే వ్యవసాయ కూలీలతో విత్తనాలను విత్తుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెరిగిపోతున్న పంట దిగుబడులకు మద్దతు ధర పెరగడం లేదని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-06-19T05:46:56+05:30 IST