వలస నాయకుడితో ఇబ్బందులు: వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2020-08-02T11:00:36+05:30 IST

ఏళ ్లతరబడి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా ఎన్నికల ..

వలస నాయకుడితో ఇబ్బందులు: వైసీపీ నేతలు

తిమ్మాపురం (సర్పవరంజంక్షన్‌), ఆగస్టు 1: ఏళ ్లతరబడి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా ఎన్నికల ముందు వలస వచ్చిన నేతకు అధికారాలు అప్పజెప్పడం సరికాదని వైసీపీ నేతలు కొండపల్లి పుత్రయ్య, దొడ్డిపట్ల సూరిబాబు ఆరోపించారు. తిమ్మాపురంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇల్లులేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్‌, మంత్రి కన్నబాబు చెప్పారన్నారు. పార్టీలకతీతంగా అర్హుల జాబితాలు అధికారులు సిద్ధం చేశారన్నారు.


అయితే వైసీపీకి చెందిన సుమారు 125 మంది లబ్ధిదారుల పేర్లను ఎంపికైన జాబితాల నుంచి వలస నాయకుడు తొలగించారని ఆరోపించారు. ఈ విషయమై మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లగా తక్షణం స్పందించి, అర్హులందర్నీ జాబితాలో చేర్చాలని తహశీల్దార్‌ను ఆదేశించారన్నారు. అయినప్పటికీ సదరు నేత ప్రోద్బలంతో స్థానిక వీఆర్వోలు అర్హుల జాబితాలను పక్కన పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులు జి.దివానం, పి.కుబీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-02T11:00:36+05:30 IST