అధికార పార్టీ అండతోనే ఆక్రమణలు

ABN , First Publish Date - 2021-06-23T04:51:17+05:30 IST

అధికార పార్టీ అండతోనే టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ చందా సంతోష్‌, కో కన్వీనర్‌ గురిజాల గోపిలు ఆరోపించారు.

అధికార పార్టీ అండతోనే ఆక్రమణలు
వివాదాస్పద స్థలంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌ నియోజకవర్గ కన్వీనర్‌ గోపి

మణుగూరుటౌన్‌, జూన్‌ 22: అధికార పార్టీ అండతోనే టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ చందా సంతోష్‌, కో కన్వీనర్‌ గురిజాల గోపిలు ఆరోపించారు. మంగళవారం ముత్యాలమ్మనగర్‌లోని ప్రభుత్వ ఐటీఐ వెనుక ప్రాంతంలో ఓ గిరిజనుడి స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ‘తాను కొనుగోలు చేసిన స్థలంలో చిన్నరాజు అనే గిరిజనుడు మూడేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. దానిపై కన్నేసిన అధికార పార్టీ సర్పంచ్‌ జంపేశ్వరి ఆక్రమించి నిర్మాణం పనులు చేపడతోంది. పనులను అడ్డుకున్న తమవద్దకు సర్పంచ్‌ భర్త, మరికొంత మందితో వచ్చి గొడవకు దిగారు. ఆ స్థలానికి సంబంధించి ఏమైనా ఆధారాలుంటే చూపాలని మేం అడిగితే కాగితాలు లేవు. ఏమీ లేవు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ గొడవపడ్డారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని’ వివరించారు. గతంలో కూడా సర్పంచ్‌తోపాటు ఆమె భర్త ఆక్రమణకు యత్నించి నిర్మాణ పనులకు పంచాయతీ ట్రాక్టర్‌ వినయోగిస్తుండగా అడ్డుకున్నామని, అప్పుడు ఫిర్యాదు చేస్తే వెనక్కు తగ్గిన సర్పంచ్‌, ఆమె భర్తలు తిరిగి అఽధికార పార్టీ అండతో ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పిరినాకి నవీన్‌, కొమరం రాంమ్మూర్తి, వరలక్ష్మీ, షబానా, పాల్వచ రాములు, సాంభశివరావు, ఐఎస్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T04:51:17+05:30 IST