కవిత విజయంపై టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సంబరాలు

ABN , First Publish Date - 2020-10-18T22:42:46+05:30 IST

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని టీఆర్‌ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. సిడ్నీలో టీఆ

కవిత విజయంపై టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సంబరాలు

సిడ్నీ: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని టీఆర్‌ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. సిడ్నీలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ రాపోలు మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా కవిత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఎన్ఎస్‌డబ్ల్యూ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ పిన్నమ, రవి శంకర్ దూపాటి, లక్ష్మణాచార్యులు నల్లన్, రవీందర్ చింతామణి, రాజు సువర్ణ, అజాజ్ మొహమ్మద్, మేర్విన్, అరవింద్ బి, మణిదీప దరూరు, జ్యోతి వాడ్రేవు, రాహుల్ రాంపల్లి, చరణ్ గిరియపుర, అరునేశ్ సేథ్ తదితరులు ఆకాంక్షించారు. 


మెల్బోర్న్ కార్యక్రమంలో అధ్యక్షుడు కాసర్ల నగేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలవడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వివక్షకు గురైందన్నారు. తెలంగాణ బిడ్డగా కవిత.. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారన్నారు. జాగృతి సంస్థ ద్వారా మహిళలను చైతన్య పరిచి తెలంగాణ ఉద్యమంలో అతివలు ప్రధాన పాత్ర పోషించేలా కృషి చేశారన్నారు. ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. 


Updated Date - 2020-10-18T22:42:46+05:30 IST