Abn logo
Oct 16 2021 @ 19:07PM

టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటే: సీతక్క

హుజూరాబాద్‌: టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ కూడబలుక్కుని నాటకాలు ఆడుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నిరుద్యోగులకు ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని సీఎం కేసీఆర్‌ మరిచిపోయాడని దుయ్యబట్టారు. కేసీఆర్‌ మాయమాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కరోనా సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు దొంగ నాటకాలు ఆడి ప్రజల ప్రాణాలు తీశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని నౌకాశ్రయాలు, విమానాలు, రైల్వేలను ప్రైవేట్‌ పరం చేసి కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సంస్థలను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్పాలని బీజేపీ చూస్తోందన్నారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌, తాను కొట్లాడామన్నారు. ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలని సీతక్క పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...