Advertisement
Advertisement
Abn logo
Advertisement

మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ భవనాలు

- సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలి

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

సిరిసిల్ల డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనాలను నిర్మించడానికి స్థలాలను సేకరించాలని, పార్టీ ఫండ్‌ నుంచి కొనుగోలు చేద్దామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత విషయాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. గ్రామ  అధ్యక్షుల ద్వారా  సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలని, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజలతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం  అందిస్తున్న సంక్షేమ పలాలను అర్హులందరికీ చేరే విధంగా వారధిగా నిలవాలన్నారు.  అనంతరం నియోజకవర్గంలోని వివిధ అంశాలపై చర్చించారు.  సమావేశంలో తంగళ్లపల్లి  అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు వలస కృష్ణహరి, గంభీరావుపేట అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, వీర్నపల్లి అఽధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, ముస్తాబాద్‌ అధ్యక్షుడు భూంపల్లి సురేందర్‌రావు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement