సింగరేణి ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్‌ డ్రామాలు

ABN , First Publish Date - 2022-01-26T06:46:01+05:30 IST

సింగరేణి ప్రైవేటీకరణపై కా ర్మికులు తిరగబడతారని, మళ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే టీఆర్‌ఎస్‌ కొత్త డ్రామాకు తెరలేపిందని కాంగ్రెస్‌ పార్టీ రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ఆరోపించా రు.

సింగరేణి ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్‌ డ్రామాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మక్కాన్‌సింగ్‌

 - కాంగ్రెస్‌ పార్టీ రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ 

గోదావరిఖని, జనవరి 25: సింగరేణి ప్రైవేటీకరణపై కా ర్మికులు తిరగబడతారని, మళ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే టీఆర్‌ఎస్‌ కొత్త డ్రామాకు తెరలేపిందని కాంగ్రెస్‌ పార్టీ రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ఆరోపించా రు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలతో కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారని, ఇదంతా పెద్దనాటకమన్నారు. కోల్‌బెల్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త ఇండస్ట్రీ ఒక్కటి కూడా రాలేద ని, గతంలో తాడిచెర్ల ఓసీపీని ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకోని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు మళ్లీ ఓసీపీలు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమంటూ ప్రకటించడం హస్యాస్పదంగా ఉందన్నారు. సిం గరేణిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇన్ని రోజులు బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణపై కార్మికులు తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయనే కారణం,తమను గను లపైకి రానివ్వరని ప్రైవేటీకరణ ఊసెత్తుతున్నారని, ఇప్పటి కే కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి రంగంసిద్ధం చేసిందన్నారు. కాం గ్రెస్‌, ఐఎన్‌టీయూసీలు సింగరేణిని ప్రైవేటీకరణ చేయవద్దంటూ పలుమార్లు ముఖ్యమంత్రికి కూడా తమ నాయకు లు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి ద్వారా విన్నపం చేశామని చె ప్పారు. గోదావరిఖనిలో ఓసీపీ5ద్వారా భవిష్యత్‌ ఉండదని ఎన్నికల ముందు స్థానిక శాసనసభ్యుడు ఓసీ పీ5 వస్తే ఆపుతానని చెప్పి పోలీసుల బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణను గెట్టెక్కించుకుడని విమర్శించారు. జీడీకే ఓసీపీలో ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో ఎమ్మె ల్యే సమాధానం చెప్పాలని, ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణిలో ఓసీపీలకు స్వస్తిపలికి భూగర్భ గనులను ప్రారంభించి యు వతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలకు కార్మికులు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, కాం గ్రెస్‌ నాయకులు పెద్దెల్లి ప్రకాష్‌, సనా ఫకృద్దీన్‌, తాళ్లపల్లి యుగేందర్‌, గట్ల రమేష్‌, నజీమోద్దీన్‌, అనుమ సత్యనారాయణ, ప్రవీణ్‌, వసంత్‌, సురేష్‌, కార్తీక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:46:01+05:30 IST