Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 15:55PM

వారు ఎక్కడైనా జై తెలంగాణ అన్నారా?: రవీందర్ సింగ్

కరీంనగర్: టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీలుగా నిలుచున్న భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ ఎక్కడైనా, ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అని సీఎం కేసీఆర్‌ను కరీంనగర్ మాజీ మేయర్, కార్పొరేటర్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల సమస్యలపై ఎప్పుడైనా భాను ప్రసాద్ మాట్లాడాడా అని ఆయన నిలదీశారు. 24 గంటల్లోనే కలెక్టర్ వెంకట్రామా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులను పక్కబెట్టడం ఏంటన్నారు. డబ్బుల సంచులతో వచ్చి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆరే తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారని ఆయన పేర్కొన్నారు. 

టీఆర్‌ఎస్ తరపున రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. అయితే తనకు కాకుండా నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన భాను, రమణలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో టీఆర్‌ఎస్’కు మొదటి నుంచి పట్టున్న కరీంనగర్ జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్ దారుణంగా ఓడిపోయి బీజేపీ తరపున ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో టీఆర్‌ఎస్ ఒక సీటును ఓడిపోతుందని చెప్పడం విశేషం.


Advertisement
Advertisement