టీఆర్‌ఎస్‌ వరద రాజకీయాలు

ABN , First Publish Date - 2020-10-25T05:57:31+05:30 IST

అధికార పార్టీ నాయకు లు వరద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివా రం గద్వాలలోని డీకే బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు

టీఆర్‌ఎస్‌ వరద రాజకీయాలు

ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి 

మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


గద్వాల, అక్టోబరు 24: అధికార పార్టీ నాయకు లు వరద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివా రం గద్వాలలోని డీకే బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరద ముంపు వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని, నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా, పార్టీ కార్యకర్తలకు ఇచ్చి బాధితులకు ఇవ్వాలని చూస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధితులు రూ.ల క్షల్లో నష్టపోతే ప్రభుత్వం వారికి రూ.వేలల్లో కూడా నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఆరోపించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధిని పొం దుతున్న వారిని పూర్తిగా ప్రభుత్వమే అదుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం మాట ప్రకారం రైతులు నియంత్రిత సాగు విధానానికి మొగ్గు చూపినా భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపాయారని ఆవేదన వ్యక్తం చేశారు.


రైతులను ఆదుకునేందుకుగాను ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభు త్వం క్రమం తప్పకుండా ఉద్యోగులకు 3.14 శాతం డీఏను ప్రకటిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు డీఏలు ఇవ్వాల్సి ఉండగా వాటిని పెండింగ్‌లో పెట్టిందని, వాటి గురించి సీఎం ముందు మాట్లాడే దమ్ములేని ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాల నాయకులు, ఏకపక్షంగా ముఖ్య మంత్రి సహాయ నిధికి ఉద్యోగుల ఒక రోజు మూలవేతనం రూ.33 కోట్లు చెల్లించడానికి ముం దుకు రావాడాన్ని తప్పబట్టారు.


ఉద్యోగలకు ఇవ్వా ల్సిన డీఏలు, ఐఆర్‌లు ఇంత వరకు ప్రకటించలేద ని, పీఆర్సీ ప్రస్తావనే లేకుండా చేశారని వీటిని అడ గకుండా, ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరి మెప్పు కోసం ఒక రోజు వేతనం చెల్లిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. అక్రమంగా అరెస్టు చేసిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటే బీజే వైఎం నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు రాంచంద్రారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T05:57:31+05:30 IST