లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం: వంశీచంద్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-28T20:52:46+05:30 IST

లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. సగం జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని

లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం: వంశీచంద్‌రెడ్డి

హైదరాబాద్: లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. సగం జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని, అప్పులు చెల్లించడం కోసం ఉద్యోగుల వేతనాలు ఆపడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ కంటే ఆర్థికంగా వెనకున్న ఏపీ, బిహార్‌లో పూర్తి వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ ఎందుకు మొత్తం జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని, ఆర్థిక క్రమశిక్షణ లేనందునే ఈ పరిస్థితి వచ్చిందని వంశీచంద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-05-28T20:52:46+05:30 IST