Abn logo
Sep 26 2021 @ 22:11PM

హామీలకే పరిమితమవుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్‌

బెల్లంపల్లి, సెప్టెంబరు 26: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీలకే పరిమిత మవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్‌, ఏఐటీ యూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, చిప్ప నర్సయ్యలు పేర్కొన్నారు. ఆదివారం బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజ రయ్యారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలతోపాటు ఎన్నికల సందర్భం గా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల గురించి చర్చించారు.  నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లోని పోడు వ్యవసాయ దారులకు పట్టాలు ఇవ్వాలని, రెవెన్యూ ఫారెస్టు భూముల వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. పరిశ్రమలను మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తు లకు కట్టబెట్టే కుట్ర చేస్తుందన్నారు. ఈ విధానాలకు నిరసనగా సోమ వారం చేపట్టే భారత్‌బంద్‌ విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా రేగుంట చంద్రశేఖర్‌ను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. దాగం మల్లేష్‌, గుండ చంద్రమాణిక్యం, ప్రశాంత్‌,  రాజేందర్‌, రాజేశం, తిరుపతి, లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.