Advertisement
Advertisement
Abn logo
Advertisement

తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలి: Balka suman

హైదరాబాద్: ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను  జమున హేచరీస్ కబ్జా చేసారని మెదక్ కలెక్టర్ చెప్పారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. నీతి నిజాయితీ అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విధంగా కబ్జా చేశారని ప్రశ్నించారు. కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని... తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలని వ్యాఖ్యానించారు. కబ్జాలు చేసి, నోరు లేని పేదల భూములను లాక్కుని మళ్ళీ వీల్లే దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. నిజాయితీగా పని చేస్తున్న కలెక్టర్‌ను భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యయ్యో కలెక్టర్ నిగ్గూ తేల్చాలన్నారు. కలెక్టర్‌పై ఈటల రాజేందర్, అతని భార్య మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని బాల్కా సుమన్ పేర్కొన్నారు. 


ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ... 71 ఎకరాలు కబ్జా చేసాడంటే ఈటెల 71 సార్లు ముక్కు నేలకు రాయాలన్నారు.  ఇన్ని ఎకరాలు కబ్జా చేసిన ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లను ఈటెల బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న ఈటల రాజేందర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


Advertisement
Advertisement