Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 26 2021 @ 16:34PM

కేసీఆర్‌‌తోనే ఆయిల్ పామ్‌కు రేటు: తుమ్మల

ఖమ్మం: జిల్లాలో రైతులు పండిస్తున్న ఆయిల్ పామ్‌కు రేటు రావడానికి కారణం కేసీఆర్‌‌ విధానాలేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్వ ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తుమ్మల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే ఆయిల్ పామ్ రేటు 7 వేల నుంచి 18 వేలకు పెరిగిందన్నారు. రైతాంగం సంతోషంగా ఉన్నారంటే కేసీఆర్‌ విధానాలే కారణమన్నారు.కేసీఆర్ ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారన్నారు. పిల్లలకు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఘనతంతా కేసీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. 


Advertisement
Advertisement