Abn logo
Sep 24 2021 @ 23:58PM

హరీశ్‌రావును కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన నర్సాపూర్‌ నాయకులు

నర్సాపూర్‌/వెల్దుర్తి/శివ్వంపేట/చిన్నశంకరంపేట, సెప్టెంబరు 24: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన పలువురు నాయకులు కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు మండల నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బోగచంద్రశేఖర్‌,  పట్టణ నూతన అధ్యక్షుడు భిక్షపతితో పాటు ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌, గొర్రెవెంకట్‌రెడ్డి, మాణయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ మండల, పట్టణ అఽధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రశేఖర్‌, భిక్షపతిలను శాలువా, పూలమాలతో మంత్రి సత్కరించారు. అదేవిధంగా మాసాయిపేట మండల నూతన టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా గ్రామసర్పంచ్‌ చిన్నచౌదరి మధుసూదన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా సిద్దిరాములుగౌడ్‌, యూత్‌ అధ్యక్షుడిగా పవన్‌, మండల ఎస్టీసెల్‌ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌నాయక్‌తో పాటు గ్రామపార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ కొల్చారం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరీశంకర్‌ మంత్రి హరీశ్‌రావును కలిసి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.ఆయన వెంట ఎంపీపీ మంజుల కాశీనాథ్‌, సర్పంచ్‌ వీరారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. శివ్వంపేట మండల అఽధ్యక్షుడిగా ఎన్నికైన రమణాగౌడ్‌తో పాటు ఎంపీపీ హరికృష్ణతో పాటు మండలానికి చెందిన పలువురు నాయకులు మంత్రి హరీశ్‌రావును కలువగా ఆయన శాలువా కప్పి అభినందించారు. చిన్నశంకరంపేట మండల టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడిగా కోడూరి రమే్‌షగౌడ్‌ నియామకమయ్యారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పట్లోరి రాజు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.