బండి సంజయ్ జైలుకు వెళ్లడం ఖాయం: ఎమ్మెల్యే మానిక్ రావు

ABN , First Publish Date - 2022-01-14T01:34:04+05:30 IST

తన నోరును అదుపులో పెట్టుకోకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

బండి సంజయ్ జైలుకు వెళ్లడం ఖాయం: ఎమ్మెల్యే మానిక్ రావు

సంగారెడ్డి: తన నోరును అదుపులో పెట్టుకోకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లడం ఖాయమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మానిక్ రావు హెచ్చరించారు. జిల్లాలోని జహీరాబాద్‌లో ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సంజయ్‌కి లేదన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము బీజేపీకి లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎరువుల ధరలను పెంచుతూ రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని ఆయన హితవు పలికారు. 


Updated Date - 2022-01-14T01:34:04+05:30 IST