Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రదర్‌ అనిల్‌తో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య భేటీ!

హైదరాబాద్‌/ జనగామ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):  వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌తో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం నాడు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీ.. లోటస్‌ పాండ్‌లో కాకుండా వేరే ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. కొద్దిరోజులుగా బ్రదర్‌ అనిల్‌తో రాజయ్య తరచూ భేటీ అవుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ భేటీ మతపరమైనదా.. లేదా రాజకీయ పరమైనదా అన్న విషయంపై స్పష్టత లేదని అంటున్నాయి. 

Advertisement
Advertisement