కేంద్రానిది ద్వంద్వ నీతి: ఎంపీ నామా

ABN , First Publish Date - 2021-11-30T22:24:39+05:30 IST

తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ

కేంద్రానిది ద్వంద్వ నీతి: ఎంపీ నామా

ఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ నీతిని అవలంభిస్తోందని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఆందోళనల నడుమ లోక్‌సభలో సుప్రీంకోర్టు, హైకోర్ట్ జడ్జీల వేతనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.



60 రోజులుగా రైతుల ధాన్యం సేకరణ చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పార్లమెంట్ వేదికగా నిరసన తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడో రకంగా.. తెలంగాణలో ఇంకో రకంగా చెబుతూ ద్వంద్వ నీతి అవలంభిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని నామా డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-30T22:24:39+05:30 IST