Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ ఎంపీల డ్రామా

ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ 

హుజూర్‌నగర్‌ , డిసెంబరు 8 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్టోబరు నుంచి వరి కోతలు మొదలయ్యాయని; మూడు నెలలైనా ధాన్యం సేకరణ చేయలేదన్నారు. కాగా ఆగస్టు నాటికి 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ఆదేశాలున్నా సగభాగం కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించకుండా; పార్లమెంట్‌లో డ్రామాలు ఆడుతూ వాకౌట్‌ చేస్తున్నారన్నారు. తెలంగాణాలో ధాన్యం సేకరణ చేయకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధాన్యం సేకరణపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ కేంద్రాన్ని కోరారు. ఉత్తమ్‌ ప్రశ్నలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దానిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని అన్నారు. బియ్యం సేకరణ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.  

Advertisement
Advertisement