టీఆర్‌ఎస్‌ కమిటీ ఎంపిక వాయిదా

ABN , First Publish Date - 2021-09-19T05:06:18+05:30 IST

టీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఎన్నిక శనివారం జరగాల్సి ఉండగా, ఈనెల 19కు వాయిదా పడింది.

టీఆర్‌ఎస్‌ కమిటీ ఎంపిక వాయిదా
మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెంకట్రావ్‌

పోటీలో ఐదుగురు ఆశావాహులు

దుమ్ముగూడెం సెప్టెంబరు 18: టీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఎన్నిక శనివారం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. లక్ష్మీనగరంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తెల్లం వెంకట్రావు సమక్షంలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించగా, నాయకులు, కార్యకర్తలు భిన్న వాదనలు వినిపించారు. ప్రస్తుత అధ్యక్షుడు అన్నె సత్యనారాయణ పార్టీను సమర్దవంతంగా నడపడంలో విఫలమయ్యారని, రైతు సమితి అధ్యక్షుడు బత్తుల శోభన్‌బాబు విమర్శించారు. దీంతో కొందరు కార్యకర్తలు ఈ విషయాన్ని గట్టిగా తిప్పికొట్టడంతో పాటు, ప్రతివిమర్శలు చేశారు. కరోనా కష్ట కాలంలోనూ తాను చేసిన సేవలను అన్నె సత్యనారాయణ వివరించారు. పార్టీ బహిష్కరించిన ఒక నాయకుడి ఇంటి వద్ద జరిపిన స మావేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని కొందరు ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని వెంకట్రావు గట్టిగా మందలించారు. ఏదైనా సమస్య ఉంటే తనకు తెలపాలని సూచించారు. నరసాపురం పంచాయతీకి రూ1.70లక్షల నిధులు ఇచ్చారని, మిగతా పంచాయతీలకు ఎందుకు ఇవ్వలేదని కొందరు సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సర్పంచిలందర్నీ మంత్రి వద్దకు తీసుకెళ్లి నిధుల సమస్యను చెబుదామని వెంకట్రావు తెలిపారు. ప్రస్తుత మండలాధ్యక్షుడు అన్నె సత్యనారాయణ పనితీరుకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు వాదనలు వినిపించారు. కాగా మండలం నుంచి మొత్తం ఐదుగురు ఆశావాహులు అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేశారు. వీరిలో తాజా అధ్యక్షుడు అన్నె సత్య నారాయణమూర్తి, కొత్తూరి సీతారామారావు, సర్పంచ్‌ వర్సా శివరామకృష్ణ, రైతు సమితి అధ్యక్షుడు బత్తుల శోభన్‌బాబు, మాజీ మండల కార్యదర్శి కణితి లక్ష్మణ్‌ ఉన్నారు. అందర్నీ సంతృప్తి పరిచే విధంగా కమిటీ ఎంపిక ఉండే అవకాశం కనబడుతోంది. ఈనెల 19న ఎన్నికల కమిటీ సభ్యులు మంత్రి సత్యవతి రాథోడ్‌, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, తుళ్లూరి బ్రహ్మయ్య సమక్షంలో భద్రాచలంలోని ఓ హోటల్‌లో మండల కమిటీ భవితవ్యం తేలనుంది. సమావేశంలో ఎంపీపీ రేసు లక్ష్మి, నాయకులు కెశీతారామారావు, కామేశ్వరావు, మట్టా వెంకటేశ్వరావు, ఎండీ రబ్బానీ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:06:18+05:30 IST