టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2020-12-05T06:40:23+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజా ఉద్యమాలతోనే చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు గణనీయంగా పెరగడంతో శుక్రవారం హలియాలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆమన మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలి
హాలియాలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ రాష్ట్ర నాయకుడు నూకల నరసింహారెడ్డి 

హాలియా, డిసెంబరు 4: టీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజా ఉద్యమాలతోనే చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు గణనీయంగా పెరగడంతో  శుక్రవారం హలియాలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆమన మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు  వ్యతిరేకంగా ఉన్నారడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. దుబ్బాక షాక్‌తో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావిడిగా ఎన్నికలు నిర్వ హించినప్పటికీ గతంలో నాలుగు స్థానాల్లో  ఉన్న బీజేపీ నేడు 50 స్థా నాలకు చేరువైందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకు డు కడారి అంజయ్య యాదవ్‌,  బాణావత్‌ బాబురావునాయక్‌, చెన్ను వెంకట్‌నారయణరెడ్డి, పోట్టేపాక సాంబయ్య, వనం మదన్‌మోహన్‌, జితేందర్‌రెడ్డి, శేఖర్‌, రామచంద్రం, నాగార్జునరెడ్డి, భూపాల్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌, నాగేంద్రమ్మ, స్వాతి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

వేములపల్లి:  మండలకేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిలివేరు జగదీష్‌, కిసాన్‌మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవ్వాజి సత్యనారాయణయాదవ్‌, సీనియర్‌ నాయకుడు కర్ర దామోదర్‌రెడ్డి, బాలయోగి  పాల్గొన్నారు. 

డిండి: గ్రేటర్‌ ఎన్నికల్లో  బీజేపీ సత్తాచాటడంతో ఆపార్టీ నాయ    కులు డిండి మండల కేంద్రంలో బాణసంచా కాల్చి సంతోషం వెలి బుచ్చారు. కార్యక్రమంలో ఏటీ కృష, ఎలకుర్తి జైపాల్‌, సైదా, రాఘవేందర్‌, వెంకటయ్య పాల్గొన్నారు.  

చింతపల్లి: మండలకేంద్రంలో బీజేపీ నాయకులు స్వీట్లు పంపిణీ చే శారు. అనంతరం రోడ్డుపై బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు శివర్ల రమే్‌షయాదవ్‌, జిల్లా ప్రధానకార్యదర్శి చనమోని రాములు, జిల్లా నాయకులు సముద్రాల నగేష్‌, వెన్నం శేఖర్‌, కుక్కుడపు రామకృష్ణ, గొడుగు శ్రీనివాస్‌, ఎండీ జహంగీర్‌, బొడ్డు మహే్‌షగౌడ్‌, రాపర్తి సతీ్‌షకుమార్‌, మోర వెంకటరమణ, ధన్‌రాజ్‌, మోయిలమోని రాజు, రామకృష్ణ, వెంకటేష్‌, నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T06:40:23+05:30 IST