Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్ఎస్‌కు ప్రజలకు గుణపాఠం చెప్పారు: బండి సంజయ్

హైదరాబాద్: టీఆర్ఎస్‌కు ప్రజలకు మంచి గుణపాఠం చెప్పారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌ హుజురాబాద్‌లో అడ్డదారిలో గెలవాలని చూసిందని, డబ్బులు పంచి హుజురాబాద్ ప్రజలను అవమానించారన్నారు. గెలవాలని అబద్దాలు ప్రచారం చేశారని బండి సంజయ్ దుయ్యబట్టారు. మరోవైపు ఊహించినట్లుగానే హుజూరాబాద్‌లో విజయం వరించడం కమలం పార్టీలో జోష్‌ నింపింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం ఒకవైపు పావులు కదుపుతుండగా, మరోవైపు రాష్ట్ర పార్టీ నాయకత్వం అధికార టీఆర్‌ఎస్‌పై పోరాటాలు చేస్తోంది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందంటూ ఆందోళనలను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో.. హుజూరాబాద్‌ విజయం కొత్త శక్తినిచ్చిందని కమలనాథులు సంబరపడుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement