టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. స్పందించని అధికారులు

ABN , First Publish Date - 2021-10-23T16:10:47+05:30 IST

ఎల్లుండి టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరీలింగంపల్లి నియోజకవర్గాల్లో వందలాదిగా వేలాదిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. స్పందించని అధికారులు

హైదరాబాద్ : ఎల్లుండి టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరీలింగంపల్లి నియోజకవర్గాల్లో వందలాదిగా వేలాదిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా కటౌట్లు ఏర్పాటు చేయడంపై బల్దియాకు ఫిర్యాదులు అందుతున్నాయి. టీఆర్ఎస్ నేతలపై చలనాలు వేయకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాత్కాలికంగా ఎన్ఫోర్స్‌మెంట్ ట్విటర్ ఖాతాను అధికారులు నిలిపివేశారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ మూడురోజుల సెలవులో ఉన్నారు. నెటిజన్ల ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ కమిషనర్  స్పందించడం లేదు.

Updated Date - 2021-10-23T16:10:47+05:30 IST