విజయం మాదే..కారుకు బ్రేకులు లేవు: టీఆర్ఎస్

ABN , First Publish Date - 2020-12-04T19:21:50+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని, కారుకు బ్రేకులు లేవని, మేయర్ పీఠం తమదేనని..

విజయం మాదే..కారుకు బ్రేకులు లేవు: టీఆర్ఎస్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని, కారుకు బ్రేకులు లేవని, మేయర్ పీఠం తమదేనని టీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వందకుపైగా సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. కాగా టీఆర్ఎస్ 54, బీజేపీ 33, ఎంఐఎం 22, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-12-04T19:21:50+05:30 IST