అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2021-06-24T19:52:33+05:30 IST

తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు...

అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత

హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్‌ : తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సీబీ వెంకటేష్‌(72) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. తెలంగాణ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణరెడ్డి, అంజయ్యగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, ముక్కా శ్రీనివాస్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకటేష్‌ అంత్యక్రియలు బన్సీలాల్‌పేట్‌ హిందూ శ్మశానవాటికలో జరిగాయి.

Updated Date - 2021-06-24T19:52:33+05:30 IST