Abn logo
Jan 27 2021 @ 01:05AM

అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ శ్వేత పత్రం విడుదల చేయాలి

గంభీరావుపేటలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా ఉపాద్యక్షులు, సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు

గంభీరావుపేట, జనవరి 26 : గంభీరావుపేటలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అబివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు,   సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు డిమాండ్‌ చేశారు. గంభీరావుపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  మాట్లాడారు. జాతీయ కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌ల చైర్మన్‌ రవీందర్‌రావు తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రోడ్ల వెడల్పులో తనకు పట్టింపు లేదని చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు.  పెద్దకాలువ ద్వారా వచ్చే నీరు కాలువ వెంబడి ఉన్న పంటలకు ఉపయోగం లేదనే అంశంపై ఆయకట్టు రైతులు ఆందోళన చేస్తే సర్పంచ్‌గా వారికి సంఘీభావం తెలపడంలో తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పెద్ద కాలువ వెంబడి ఉన్న పంటల పరిస్థితిని కాలువ ద్వార వెళుతున్న నీరు ఎక్కడికి వెళుతున్నాయో స్వయంగా పరిశీలించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి,  పార్టీ మండల అధ్యక్షుడు అశోక్‌, ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి  కృష్ణ, కార్యదర్శి బుగ్గారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement