గ్రేటర్‌లో టీఆర్ఎస్ జోరు.. అయితే..

ABN , First Publish Date - 2020-12-04T21:05:21+05:30 IST

గ్రేటర్‌లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది.

గ్రేటర్‌లో టీఆర్ఎస్ జోరు.. అయితే..

హైదరాబాద్: గ్రేటర్‌లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఏ మాత్రం కనిపిండంలేదు. మరోవైపు టీఆర్ఎస్‌ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ చెమటలు పట్టించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

Updated Date - 2020-12-04T21:05:21+05:30 IST