నేడు KCR అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. ముందస్తు ఎన్నికలపై చర్చ!

ABN , First Publish Date - 2021-10-17T14:33:49+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం...

నేడు KCR అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. ముందస్తు ఎన్నికలపై చర్చ!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈనెల 25న జరగనున్న ప్లీనరీపై కీలకంగా చర్చ జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వ్యూహాలు ఖరారు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై ఈ సమావేశంతో క్లారిటీ వచ్చే అవకాశముంది. పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 23న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత 25న టిఆర్ఎస్ ప్లీనరీ సభ జరుగుతుంది. అదే రోజు టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.


ఇదిలా ఉంటే.. రేపు ఉదయం11 గంటలకు కేసీఆర్ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నామినేషన్లు వేయనున్నారు. ప్రతీ నాలుగేళ్లకోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరగుతందన్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి.. పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి వ్యవహరిస్తారు.

Updated Date - 2021-10-17T14:33:49+05:30 IST