Advertisement
Advertisement
Abn logo
Advertisement

సత్యమైన సంక్రాంతి

పండుగలకు పుట్టినిల్లయిన భారత్‌లో సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసు సంకీర్తనలు కలగలిసిన విశేషతలతో కూడిన వేడుక ఇది. ప్రకృతిలో జరిగే సహజమైన ఒక గొప్ప మార్పు... భోగి పండుగ. సంక్రాంతి మహిళల ఆత్మకు ప్రతీక. రైతన్నలు ధాన్య రాశుల్ని ఈ సమయంలోనే ఇంటికి చేరుస్తారు. మూడో రోజు కనుమ. స్త్రీలు పసుపు వర్ణం వస్త్రాలు ధరించి, నోములు నోచుకొంటారు. 


నిరాకార పరమపిత... జ్ఞానసూర్యుడు... శివపరమాత్మ పురుషోత్తమ సంగమ యుగంలో అవతరించడానికి నిదర్శనమే ఈ సంక్రాంతి. అజ్ఞాన చీకట్ల నుంచి అనగా కలికాలం నుంచి సత్య యుగానికి జరిగే కాలచక్రంలో వచ్చే మార్పునకు గుర్తు. భోగి అంటే అనిర్వచనీయమైన భగవంతునితో సంలగ్నమ్‌ చేసిన స్మృతి అనే జ్వాలారూప స్థితితో యోగ అగ్నిలోని మనుష్య ఆత్మలో ఉండే పాత స్వభావ సంస్కారాలు భస్మం చేయడం. ముగ్గులు సూక్ష్మక్రిములను పారద్రోలడంలో సహకరిస్తాయి. హరిదాసు సంకీర్తనలు భగవంతుని మహిమలను కొనియాడడానికి సంకేతాలు. భగవంతుడు తాను రచించిన గీతా జ్ఞానయజ్ఞ నిర్వహణలో మహిళల యొక్క స్వతఃసిద్ధమైన లక్షణాలకు అనుగుణంగా ప్రాముఖ్యం ఇవ్వడం వల్లనే ఇది స్త్రీమూర్తుల పండుగ అయింది. నోములు నోచుకోవడం అనేది దానగుణానికి గుర్తు. పసుపు వర్ణం కళ్యాణకారి సంగమ యుగానికి ప్రతీక. సంక్రాంతి ఆధ్యాత్మిక క్రాంతికి, విశ్వశాంతికి నిదర్శనం. కలియుగ అంతంలో సంగమ యుగంలో మానవుని కృషి ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతీకగా ఉండాలని కోరుకొంటారు. సంక్రాంతి అంటే సంక్రమణం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణం అంటే... ద్వాపర కలియుగాలనే కాలచక్రం నుంచి జ్ఞానసూర్యుడు, ఆ పరమపిత శివపరమాత్మ సత్యయుగమనే ఉత్తరాయణానికి ఆత్మలతో ప్రయాణం చేస్తాడు.

 

బ్రహ్మ తనువులో శివపరమాత్మ అవతరించి ఈ సంగమయుగంలో ద్వాపర కలియుగాల భక్తులను జ్ఞానయోగాలతో బ్రహ్మవత్సలుగా పరివర్తన చేయడమే నిజమైన క్రాంతి. అపవిత్రమైన ఆత్మలు అతిపవిత్రమైన దైవీ ఆత్మలుగా మార్పు చెందడమే సంక్రాంతి. పవిత్రమైన ఆత్మలే రాబోయే సత్య త్రేతాయుగాల్లో దేవి, దేవతలుగా మార్పు చెండమే మహాపరివర్తన. ఆత్మలో క్రాంతి ప్రపంచానికి శాంతి... క్రాంతి. ప్రతిఒక్కరూ క్రాంతి నింపుకొని స్వపరివర్తన చేసుకోవడమే విశ్వపరివర్తనకు ఆధారం.  

బ్రహ్మకుమారీస్‌ 

7032410931

Advertisement
Advertisement