ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-10-19T05:24:40+05:30 IST

ట్రూ అప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. విదుత్‌చార్జీలపై సీఎం జగన్‌ మాట తప్పారని ధ్వజమెత్తారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సోమవారం వారు పర్యటించారు.

ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలి
గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న తిక్కారెడ్డి

  1. టీడీపీ నాయకుల డిమాండ్‌


ట్రూ అప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. విదుత్‌చార్జీలపై సీఎం జగన్‌ మాట తప్పారని ధ్వజమెత్తారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సోమవారం వారు పర్యటించారు. 


మంత్రాలయం, అక్టోబరు 18: అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచనని చెప్పిన వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మాటతప్పారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పాలని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని, కోతలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వగరూరు, వి.తిమ్మాపురం, బూదూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. గ్రామాల్లో టీడీపీ జెండా ఎగురవేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పింఛన్ల తొలగింపు, విద్యుత్‌చార్జీల పెంపుపై గ్రామస్థులు మండిపడ్డారు. నిత్యావసర సరుకుల నుంచి పెట్రోలు, డీజిల్‌ గ్యాస్‌, విద్యుత్‌ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై ఎనలేని భారం పడిందని అన్నారు. తిక్కారెడ్డికి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు చావిడి వెంకటేష్‌, వగరూరు రామిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, అబ్దుల్‌, నజీర్‌ అహ్మద్‌, దస్తగిరి, సత్యన్న, ఏలీయా, నిజాముద్దీన్‌, మల్లేస్‌, వీరారెడ్డి, సుధాకర్‌రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, కేశన్న పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని మాజీ ఎంపీపీ వాల్మీకి శంకరయ్య డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోటేకల్‌ గ్రామంలో విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలను పెంచనని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌, నేడు ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని విమర్శించారు. నిత్యావసరాలు, ఇంధనం ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగయ్య, నాగరాజు, ఖాజ, శ్రీనివాసులు, మహేష్‌, బి.ఆదెప్ప, రంగస్వామి, అల్లబకాష్‌, హమీద్‌, గురుజుల, రాముడు, నాగరాజులు పాల్గొన్నారు.


గోనెగండ్ల: ప్రభుత్వం ట్రూ అప్‌ చార్జీలను వెంటనే రద్దు చేయాలని గోనెగండ్ల టీడీపీ నాయకులు రమేష్‌ నాయుడు, యూనుస్‌, దరగల మాబు, చెన్నలరాయుడు, కౌలుట్లయ్య నాయుడు, అడ్వొకేట్‌ చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉప సర్పంచ్‌ కాశీం, వినోద్‌, రంజాన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:24:40+05:30 IST