ట్రూకాలర్‌లో కొత్తగా చేరాయి

ABN , First Publish Date - 2021-06-19T05:22:24+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులకు పాపులర్‌ యాప్‌ ‘ట్రూకాలర్‌’ ప్రత్యేకించి మూడు ఫీచర్లను ప్రకటించింది. గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌, స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌,

ట్రూకాలర్‌లో కొత్తగా చేరాయి

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులకు పాపులర్‌ యాప్‌ ‘ట్రూకాలర్‌’ ప్రత్యేకించి మూడు ఫీచర్లను ప్రకటించింది. గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌, స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌, ఇన్‌బాక్స్‌ క్లీనర్‌ను వినియోగదారుల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ మేరకు రూపొందించింది. 


గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌

పేరుకు తగ్గట్టు ఈ ఫీచర్‌తో ఒకేసారి ఏడుగురితో మాట్లాడవచ్చు. వినియోగదారుడికి తెలియకుండా కాల్‌ గ్రూప్‌లో చేరిన అంటే స్పామ్‌ యూజర్లను గుర్తించవచ్చు. ఫోన్‌బుక్‌లో కలుపుకోకుండానే, కొత్త పార్టిసిపెంట్లతో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుతున్నప్పుడు అందులో పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్‌ ఉన్న నగరాన్ని తెలియజేస్తుంది. ఈ ఫీచర్‌తో జరిగే కాల్స్‌ అన్నీ భద్రత సహా సిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌ కలిగి ఉంయని ట్రూకాలర్‌ చెబుతోంది. 


స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌

వినియోగదారులు అందుకునే మెసేజ్‌ టెక్స్ట్‌ల్లో 80 శాతం స్పామ్‌ తరహావే ఉంటాయి. ఆ కారణంగానే వాటిని ఫిల్టర్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్పామ్‌ కాలర్లను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్న శక్తిమంతమైన అల్గోరిథమ్స్‌ ఆధారంగానే ఈ ఫిల్టర్‌ పని కూడా చేయవచ్చు. అలాగే ఈ పనిని ఆఫ్‌లైన్‌లోనూ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం మన దేశం సహా కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికాలో ఉంది. అమెరికా, స్వీడన్‌, మలేషియా, ఇండోనేషియా, ఈజిప్టుకూ దీన్ని విస్తరించనున్నారు. 


ఇన్‌బాక్స్‌ క్లీనింగ్‌

అనవసరమైన మెసేజ్‌లను వేగంగా వదిలించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇన్‌బాక్స్‌ క్లీనర్‌ మెనూ నుంచి చూస్తే పేరుకుపోయిన పాత ఓటీపీలు, స్పామ్‌ మెసేజ్‌లు కనిపిస్తాయి. క్లీనప్‌ బటన్‌ నొక్కితే చాలు, అవన్నీ ఇట్టే తొలగిపోతాయి. 

Updated Date - 2021-06-19T05:22:24+05:30 IST