Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త ఫీచర్స్‌

ట్రూకాలర్‌ పలు కొత్త  ఫీచర్లను విడుదల చేసింది. ‘ట్రూ కాలర్‌ వెర్షన్‌ 12’ పేరిట ఇవి ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం విడుదల అయ్యాయి. 


వీడియో కాలర్‌ ఐడీ: దీంతో షార్ట్‌ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా వినిపిస్తాయి. సెల్ఫీ వీడియో రికార్డింగ్‌కు తోడు బిల్ట్‌ ఇన్‌ టెంప్లేట్‌తో వీడియో కాలర్‌ ఐడీని సెట్‌ చేసుకోవచ్చు.


కాల్‌ రికార్డింగ్‌: దీంతో ఇన్‌కమింగ్‌, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఫోన్‌ బుక్‌లో కాల్‌ చేసిన వ్యక్తి పేరు లేకున్నప్పటికి తన పేరును పైకి వినిపిస్తుంది. ప్రీమియమ్‌, గోల్డ్‌ చందాదారులకు మాత్రమే కాల్‌ అనౌన్స్‌ అందుబాటులో ఉంటుంది. 


ఘోస్ట్‌ కాల్‌: దీంతో ఎవరిదైనా ఫొటో, పేరు, నంబర్‌ వినియోగదారుడు సెట్‌ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కాల్‌ చేసినప్పుడు మొత్తం వివరాలు కనిపిస్తాయి. ఇది కూడా ప్రీమియమ్‌, గోల్డ్‌ చందాదారులకు మాత్రమే కాల్‌ అనౌన్స్‌ అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement