Abn logo
Sep 23 2021 @ 00:30AM

టీడీపీ వల్లే ట్రూఅప్‌ చార్జీలు: ఎమ్మెల్సీ

హిందూపురం టౌన, సెప్టెంబరు 22: డిస్కంల నిర్వహణ, సర్దుబాటుతో ట్రూఆఫ్‌ చార్జీల రూపంలో ప్రజలపై పడుతున్న భారం తెలుగుదేశం పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్లే అని ఎమ్మె ల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన తన ని వాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహనరెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధిని చూసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ వైపు నిలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున బీ-ఫారాలు అందించి పోటీ చేయలేదని చెప్పడం దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మారుతిరెడ్డి, ఎంపీటీసీలు, పురుషోత్తంరెడ్డి, జగన్మోహనరెడ్డి, నా యకులు రామక్రిష్ణారెడ్డి, రాజారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.