ట్రంప్ సర్కారు చేసిన ఆ ఒక్క ప్రకటన ఎఫెక్ట్.. రూ. 100 బిలియన్ డాలర్లు..!

ABN , First Publish Date - 2020-10-21T22:45:08+05:30 IST

సరిగ్గా నాలుగు నెలల క్రితం.. అంటే జూన్ 22న ప్రపంచమంతా షాకయ్యేలా ట్రంప్ సర్కారు ఓ కీలక ప్రకటన చేసింది.. ‘ఈ రోజు(జూన్ 22 నుంచి) నుంచి ఈ యేడాది డిసెంబర్ 31 వరకు అమెరికాలోకి ఇమ్మిగ్రెంట్స్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసాలపై నిషేధం విధిస్తున్నాము.. ఈ వీసాల ద్వారా అమెరికాలోకి ఎవరినీ రానివ్వం..

ట్రంప్ సర్కారు చేసిన ఆ ఒక్క ప్రకటన ఎఫెక్ట్.. రూ. 100 బిలియన్ డాలర్లు..!

వాషింగ్టన్: సరిగ్గా నాలుగు నెలల క్రితం.. అంటే జూన్ 22న ప్రపంచమంతా షాకయ్యేలా ట్రంప్ సర్కారు ఓ కీలక ప్రకటన చేసింది.. ‘ఈ రోజు(జూన్ 22 నుంచి) నుంచి ఈ యేడాది డిసెంబర్ 31 వరకు అమెరికాలోకి ఇమ్మిగ్రెంట్స్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసాలపై నిషేధం విధిస్తున్నాము.. ఈ వీసాల ద్వారా అమెరికాలోకి ఎవరినీ రానివ్వం.. అమెరికన్లకే మేలు చేకూర్చేలా వీసా విధానాలను పూర్తిగా మార్చేస్తాం.. ఆ తర్వాతే కొత్త విధివిధానాలను ప్రకటిస్తాం.. అప్పటి వరకు హెచ్ 1బీ, ఎల్ 1, జే 1 వీసాల ద్వారా అమెరికాలోకి ఎవరూ రావడానికి వీలు లేదు..’.. అని ట్రంప్ సర్కారు కీలక ప్రకటన చేసింది.. ట్రంప్ చేసిన ఈ ఒక్క ప్రకటన వల్ల దాదాపు రెండు లక్షల మంది విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అమెరికాలోకి అడుగపెట్టలేకపోయారు. వేల కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. 


ట్రంప్ సర్కారు ఆ ప్రకటన చేసిన మూడు నెలల తర్వాత.. దాని ఫలితం ఏంటో అమెరికా సమాజానికి తెలిసొచ్చింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటన వల్ల  ఏకంగా 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో స్పష్టమయింది.. వాషింగ్టన్‌లోని ది బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ సంస్థ ఓ పరిశోధన చేసింది.. వీసాలపై నిషేధం విధించడం వల్ల అమెరికా ఆర్థిక రంగానికి దాదాపు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తేల్చిచెప్పింది. ‘నిపుణులైన విదేశీ ఉద్యోగుల రాకపై ట్రంప్ సర్కారు నిషేధం విధించడంతో అమెరికన్ కంపెనీలు కంగుతిన్నాయి. దీని వల్ల అనేక ప్రాజెక్టుల విషయంలో ఆయా కంపెనీలు ఇబ్బందులకు గురయ్యాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా 100 బిలియన్ డాలర్ల పైనే నష్టం వాటిల్లింది..’ అని ఆ పరిశోధనలో తెలిపింది. 

Updated Date - 2020-10-21T22:45:08+05:30 IST