Joe Biden ప్రభుత్వాన్ని అమెరికన్లు విశ్వసించడం లేదట

ABN , First Publish Date - 2021-07-19T23:12:49+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న డొనాల్డ్ ట్రంప్.. గత కొద్ది రోజులుగా దూకుడు పెంచారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఇప్పటికే సంకేతాలిచ్చిన ఆయన.. బైడెన్ ప్రభుత్వం

Joe Biden ప్రభుత్వాన్ని అమెరికన్లు విశ్వసించడం లేదట

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న డొనాల్డ్ ట్రంప్.. గత కొద్ది రోజులుగా దూకుడు పెంచారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఇప్పటికే సంకేతాలిచ్చిన ఆయన.. బైడెన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. తాజాగా అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్.. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగింది. ఈ నేపథ్యంలో జో బైడెన్.. జూలై 4 (అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం) నాటికి అమెరికాలో 70శాతం మందికి వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలతో కొందరు అమెరిన్లు టీకా కోసం ముందుకు రాలేదు. ఈ క్రమంలో జూలై 4 నాటికి వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 67శాతానికే పరిమితమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంపట్ల తాజాగా స్పందించిన బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాల్లో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ‘సేవ్ అమెరికా’ వేదికగా స్పందించారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను, 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అమెరికన్లు విశ్వసించడం లేదన్నారు. అందువల్లే టీకా తీసుకోవడానికి వారు ముందుకు రావడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా టీకా వేగంగా అభివృద్ధి చెందడానికి తన ప్రభుత్వమే కారణమన్నారు. 


Updated Date - 2021-07-19T23:12:49+05:30 IST