వైట్‌హౌస్‌ను ట్రంప్ 'హాట్ జోన్'గా మార్చారు: ఒబామా

ABN , First Publish Date - 2020-10-28T20:47:31+05:30 IST

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని కరోనా పరిస్థితులను మీడియా కవర్ చేయడం పట్ల ఈర్ష్య పడుతున్నారని, కొవిడ్ విషయంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఇవాళ దేశంలో అన్ని రంగాలు తీవ్ర నష్టాన్ని చూవిచూశాయని ట్రంప్ తీరును అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు.

వైట్‌హౌస్‌ను ట్రంప్ 'హాట్ జోన్'గా మార్చారు: ఒబామా

మిల్వాకీ(యూఎస్): అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని కరోనా పరిస్థితులను మీడియా కవర్ చేయడం పట్ల ఈర్ష్య పడుతున్నారని, కొవిడ్ విషయంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఇవాళ దేశంలో అన్ని రంగాలు తీవ్ర నష్టాన్ని చూవిచూశాయని ట్రంప్ తీరును అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను ట్రంప్ 'హాట్ జోన్'గా మార్చారని దుయ్యబట్టారు. ఒబామా మంగళవారం ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నిర్వహించిన డ్రైవ్-ఇన్ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన డెమొక్రటిక్ పార్టీ లీడర్‌గా పేరున్న ఒబామా కొన్ని రోజులుగా జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతుగా ఫ్లోరిడాలో పలు ర్యాలీలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. 


"అతను మొదటి నుండి కొవిడ్‌పై దృష్టిసారించినట్లయితే, కేసులు కొత్త రికార్డు స్థాయికి చేరుకునేవి కావు. ఆయన మొదట్లో కరోనాను తేలికగా తీసుకున్నారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న పట్టించుకోలేదు. చివరకు వైట్‌హౌస్‌ను 'హాట్ జోన్'గా మార్చారు" అని ఒబామా మండిపడ్డారు. "కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఫ్లోరిడా, ఒర్లాండోలో పర్యాటక రంగం పూర్తిగా పడిపోయింది. కొవిడ్ గురించి నిజాలు మాట్లాడే శాస్త్రవేత్తలను ఆయన ఇడియట్స్ అంటారు. వైట్‌హౌస్ వద్ద సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కరోనా పాజిటివ్‌గా ఉన్న దేశవ్యాప్తంగా టూర్లు వేస్తారు." అని ఒబామా విమర్శించారు. 

Updated Date - 2020-10-28T20:47:31+05:30 IST