భారత్-పాక్ మధ్య చర్చలు జరగాలంటే దాయాది ఏం చేయాలో చెప్పిన ట్రంప్

ABN , First Publish Date - 2020-02-22T23:10:32+05:30 IST

భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గి, ద్వైపాక్షిక చర్చలు జరగాలంటే

భారత్-పాక్ మధ్య చర్చలు జరగాలంటే దాయాది ఏం చేయాలో చెప్పిన ట్రంప్

వాషింగ్టన్: భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గి, ద్వైపాక్షిక చర్చలు జరగాలంటే ఒకటే మార్గం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకుంటేనే ఇరు దేశాల మధ్య చర్చలకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నట్టు వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్ ఇండియా పర్యటన నేపథ్యంలో.. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ట్రంప్ ఇలా బదులిచ్చినట్టు పాలనా వ్యవహారాలకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల విషయం.. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులపై ఆ దేశం తీసుకునే చర్యలను బట్టే ఉంటుందని ట్రంప్ పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి శాంతి, సుస్థిరతను కాపాడుకోవాలని ట్రంప్ తన పర్యటనలో అభ్యర్థించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచే చర్యలకు కానీ, ప్రకటనలకు కానీ దూరంగా ఉండాలని ఇరు దేశాలను ట్రంప్ కోరే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Updated Date - 2020-02-22T23:10:32+05:30 IST