ట్రంప్‌కు విషంతో కూడిన ప్యాకెట్‌

ABN , First Publish Date - 2020-09-21T07:23:41+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రిసిన్‌ అనే విష పదార్థంతో కూడిన ప్యాకెట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సంఘటన కలకలం రేపుతోంది...

ట్రంప్‌కు విషంతో కూడిన ప్యాకెట్‌

  • వైట్‌హౌ్‌సకు చేరకముందే నిలిపివేసిన అధికారులు 


వాషింగ్టన్‌, సెప్టెంబరు 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రిసిన్‌ అనే విష పదార్థంతో కూడిన ప్యాకెట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సంఘటన కలకలం రేపుతోంది. అయితే ఇది వైట్‌ హౌస్‌కు చేరకముందే ఫెడరల్‌ అధికారులు నిలిపివేయడంతో ముప్పుతప్పింది. ట్రంప్‌నకు పంపిన కవర్‌ను తనిఖీ కేంద్రంలోనే అధికారులు గుర్తించారు.


కవర్‌ లోపల రిసిన్‌ అనే విష పదార్థం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ట్రంప్‌ అడ్మినిస్ర్టేషన్‌ నుంచి అధికారిక ప్రకటనేమీ వెలువడలేదు. అయితే ఈ ప్యాకెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించేందుకు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ), సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్యాకెట్‌ కెనడా నుంచి పంపి ఉంటారని భావిస్తున్నారు. రిసిన్‌ అనేది ఆముదం గింజలో సహజంగానే ఉంటుంది. ఆముదం గింజలను ప్రాసెస్‌ చేయడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రాణాంతకమైన పదార్థం. దీన్ని మింగినా, పీల్చుకున్నా లేదా ఇంజెక్ట్‌ చేసినా వికారం, వాంతులు జరుగుతాయి. శరీరంలోపల రక్తస్రావం జరిగి చివరకు అవయవాలు పాడయిపోతాయి. రిసిన్‌కు ఎలాంటి విరుగుడు లేదు. ఒకవేళ రిసిన్‌కు ఎక్స్‌పోజ్‌ అయితే 36 గంటల నుంచి 72 గంటల్లో మనిషి ప్రాణం పోతుంది. .


Updated Date - 2020-09-21T07:23:41+05:30 IST