Abn logo
Sep 26 2021 @ 21:41PM

వైద్యులు వారిస్తేనే.. లేకపోతే.. Trump కీలక వ్యాఖ్య.. బైడెన్‌కు చిక్కులు మొదలయ్యాయా..?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గద్దె దిగిన రోజున అమెరికాలో అనేక మంది మురిసిపోయారు. బైడెన్ అధికారంలోకి రావడంతో చీకటి రోజులు తొలగిపోయాయని సంబరపడ్డారు. అయితే..కథ ముగిసిపోలేదని ట్రంప్ అప్పుడే ప్రకటించారు. సీన్ కట్ చేస్తే.. అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ తరువాత ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పాపులారిటీ తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికన్ల చూపులు మరోసారి ట్రంప్ వైపు మళ్లుతున్నాయి. ఇరు నేతల ప్రజామోదయోగ్యతపై ఇటీవల జరిగిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు.

 ‘‘వైద్యులు వారిస్తే నేను మరోమారు ఎన్నికల్లో పోటీ పడకుండా ఆగిపోవచ్చు. అనేక నేతల విషయంలో ఇది జరిగింది. కానీ..నేనిప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న పరిణామాలను చూసి నాకు బాధేస్తోంది.’’ అంటూ శుక్రవారం జరిగిన రేడియో ఇంటర్వ్యూలో ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ రాబోయే అధ్యక్ష ఎన్నికలపై పరిమితంగానే మట్లాడిన ట్రంప్..ఈ మారు మరింత స్పష్టమైన కామెంట్స్ చేశారు. దీంతో..మరోమారు ట్రంప్ రంగంలోకి దిగుతారనే అంచనాలకు మరింత బలం చేకూరింది. 

తాజా వార్తలుమరిన్ని...