కరోనా దెబ్బతో ట్రంప్‌కు భారీ నష్టం!

ABN , First Publish Date - 2020-04-10T04:26:48+05:30 IST

ప్రపంచంలోని అనేక మంది అపర కుబేరులు సంపద ఆవిరైపోయింది. తాజాగా ఆ లిస్టులోకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా వచ్చి చేరారు. కరోనా దెబ్బతో షాపింగ్ మాల్స్, హోటళ్లు మూతపడటంతో ట్రంప్ సంపదలో దాదాపు ఒక బిలియన డాలర్లు( దాదాపు 7500 కోట్లు) తుడిచి పెట్టుకుపోయాయట.

కరోనా దెబ్బతో ట్రంప్‌కు భారీ నష్టం!

వాషింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచంలోని అనేక మంది అపర కుబేరులు సంపద ఆవిరైపోయింది. తాజాగా ఆ లిస్టులోకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా వచ్చి చేరారు. కరోనా దెబ్బతో షాపింగ్ మాల్స్, హోటళ్లు మూతపడటంతో ట్రంప్ సంపదలో దాదాపు ఒక బిలియన డాలర్లు( దాదాపు 7500 కోట్లు) తుడిచి పెట్టుకుపోయాయట. మార్చి 1 నాటికి ట్రంప్ వద్ద ఉన్న సంపద విలువ 3.1 బిలియన్ డాలర్లు కాగా.. మార్చి 18 కల్లా ఆ విలువ 2.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పకూలడం, హోటళ్లు, గోల్ఫో కోర్సుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడమే ఈ పరిస్థితికి కారణమని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 


Updated Date - 2020-04-10T04:26:48+05:30 IST