ఈ అంతరిక్ష యాత్రలు నా వల్లే సాధ్యమయ్యాయి: Donald Trump

ABN , First Publish Date - 2021-07-13T01:21:04+05:30 IST

అంతరిక్ష ప్రయాణాలు ప్రైవేటు రంగం పరిధిలోకి రావడమనేది తన వల్లే సాధ్యమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.

ఈ అంతరిక్ష యాత్రలు నా వల్లే సాధ్యమయ్యాయి: Donald Trump

వాషింగ్టన్: అంతరిక్ష ప్రయాణాలు ప్రైవేటు రంగం పరిధిలోకి రావడమనేది తన వల్లే సాధ్యమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. వర్జిన్ గాలెక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ చీఫ్ ఈలాన్ మస్క్ వంటి వారు నేడు అంతరిక్షయాత్రలు చేపట్టే స్థితిలో ఉన్నారంటే అది తన వల్లేనని చెప్పొకొచ్చారు. ‘‘ప్రేవేటు రంగానికి అవకాశం ఇద్దామని, ప్రభుత్వ అంతరిక్ష ప్రయోగ వేదికలను వారికి అద్దెకు ఇద్దామని నేను అప్పట్లో అధికారులకు చెప్పా.’’ అని ఫాక్స్ న్యూస్‌ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. అయితే..ప్రభుత్వ డాక్యుమెంట్లు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు సత్యదూరమని నిరూపిస్తున్నట్టు అక్కడి మీడియా పేర్కొంది. బ్రాన్సన్, బెజోస్ వంటి వారు తమ ప్రయోగాల కోసం ప్రభుత్వ వేదికలు వినియోగించుకున్నప్పటికీ..ఇందుకు సంబంధించిన ఒప్పందాలు ట్రంప్ అధికారంలోకి రాకమనుపే కుదిరాయని మీడియా పేర్కొంది. 

Updated Date - 2021-07-13T01:21:04+05:30 IST