అమెరికా టాప్ కోర్టు జడ్జిగా మహిళను నామినేట్ చేస్తా: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-21T01:16:04+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కీలక ప్రకటన చేశారు. అమెరికా అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా ఓ మహిళను నామి

అమెరికా టాప్ కోర్టు జడ్జిగా మహిళను నామినేట్ చేస్తా: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కీలక ప్రకటన చేశారు. అమెరికా అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా ఓ మహిళను నామినేట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వారిలో ఒకరి పేరును వచ్చే వారం ప్రకటిస్తానన్నారు. వివరాల్లోకి వెళితే.. పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కారణంగా అమెరికా సుప్రీం కోర్టు జడ్జి.. రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ శుక్రవారం మరణించారు. ఈ నేపథ్యంలో నార్త్ కరోలినా‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ సేవలను కొనియాడారు. అంతేకాకుండా ఆమె మృతితో ఖాళీ అయిన స్థానంలో.. ఓ మహిళనే నియమిస్తాన్నారు. ఇందుకోసం చికాగోకు చెందిన అమీ కోనీ బారెట్, అట్లాంటాకు చెందిన బార్బరా లాగోవా పేర్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరిని సుప్రీం కోర్టు జడ్జిగా వచ్చేవారం నామినేట్ చేస్తానన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీం కోర్ట్ జస్టిస్‌గా భారత సంతతికి చెందిన అముల్ థాపర్‌‌ను.. ట్రంప్ నామినేట్ చేస్తారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా మహిళను నామినేట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 


Updated Date - 2020-09-21T01:16:04+05:30 IST