నిరసనలకు ట్రంప్‌ కుమార్తె మద్దతు

ABN , First Publish Date - 2020-06-05T07:40:09+05:30 IST

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా అమెరికాలోని నల్లజాతీయులు చేస్తున్న ఆందోళనలకు అనూహ్య మద్దతు లభించింది. అధ్యక్షుడు ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫానీ ట్రంప్‌.. నల్లజాతీయుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు...

నిరసనలకు ట్రంప్‌ కుమార్తె మద్దతు

వాషింగ్టన్‌, జూన్‌ 4: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా అమెరికాలోని నల్లజాతీయులు చేస్తున్న ఆందోళనలకు అనూహ్య మద్దతు లభించింది. అధ్యక్షుడు ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫానీ ట్రంప్‌.. నల్లజాతీయుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బ్లాక్‌ స్ర్కీన్‌ ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. దాని కింద ‘ఒంటరిగా కొంతే సాధించగలం.


కలిసుంటే అద్భుతాలు చేయగలం’ అంటూ హెలెన్‌ కిల్లెర్‌ మాటలను ఉదహరించారు. అలాగే.. ‘బ్లాకౌట్‌ ట్యూస్‌డే’, ‘జస్టిస్‌ ఫర్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌’ హ్యాష్‌ ట్యాగ్‌లనూ ఆమె షేర్‌ చేశారు. టిఫానీకి ఆమె తల్లి, ట్రంప్‌ రెండో భార్య మర్లా మాపుల్స్‌ కూడా మద్దతుగా నిలిచారు.  ఆందోళనలు చేస్తున్న నల్లజాతీయులను ‘దుండగులు’గా అభివర్ణిస్తూ.. వారిపై సైన్యాన్ని ప్రయోగించేందుకు కూడా వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించిన మరునాడే ఆయన కుమార్తె నుంచే ఆందోళనకారులకు మద్దతు లభించడం విశేషం.


Updated Date - 2020-06-05T07:40:09+05:30 IST