ట్రంప్‌‌కు షాక్ ఇచ్చిన మేనకోడలు!

ABN , First Publish Date - 2020-09-26T00:38:17+05:30 IST

అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అక్కడ ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. అమెరి

ట్రంప్‌‌కు షాక్ ఇచ్చిన మేనకోడలు!

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అక్కడ ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడికి ఆయన మేన కోడలు షాక్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిపై న్యూయార్క్‌ స్టేట్ కోర్టులో దావా వేశారు. వారసత్వంగా తనకు ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ట్రంప్ సహా ఇతర కుటుంబ సభ్యులు తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తాత ఫ్రెడ్ ట్రంప్‌కు సంబంధించిన ఎస్టేట్‌లో తనకు వాటా రావాల్సి ఉందన్నారు. దాని విలువ సుమారు పదిలక్షల డాలర్ల వరకు ఉంటుందని తెలిపారు. తనకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకుండా.. ట్రంప్ సహా ఆయన సోదరి మేరీఅన్నె బ్యారీ, సోదరుడు రాబర్ట్ ట్రంప్ తనను మోసం చేశారని మేరీ ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై ట్రంప్ సహా ఆయన కుటుంబ సభ్యుల తరఫు లాయర్లు స్పందించలేదు. ఇదిలా ఉంటే రాబర్ట్ ట్రంప్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్ట్‌లో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. అమెరికాలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో ట్రంప్ మేనకోడలు.. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకెక్కడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


Updated Date - 2020-09-26T00:38:17+05:30 IST