వైట్‌హౌస్ వీడక ముందే వ్యాక్సిన్ తీసుకున్న ట్రంప్ దంపతులు!

ABN , First Publish Date - 2021-03-02T14:58:15+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఇవాంకా ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడక ముందే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ట్రంప్ అడ్వైజర్ సోమవారం తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే

వైట్‌హౌస్ వీడక ముందే వ్యాక్సిన్ తీసుకున్న ట్రంప్ దంపతులు!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఇవాంకా ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడక ముందే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ట్రంప్ అడ్వైజర్ సోమవారం తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వ్యాక్సిన్‌కు అప్రూవల్ లభించిన విషయం తెలిసిందే. అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన సమయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అనేక మంది ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా పలువురు కోరారు. అయినప్పటికి ఆయన బహిరంగంగా ఎక్కడా వ్యాక్సిన్ తీసుకోలేదు. 


అయితే ట్రంప్ జనవరిలోనే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఇప్పుడు బయటకు రావడం ఆసక్తిగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గతేడాది డిసెంబర్ 21న బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుని ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. మరోపక్క వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత మొదటిసారిగా ట్రంప్ ఆదివారం బహిరంగ సమావేశంలో పాల్గొని వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. ప్రతిఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. 

Updated Date - 2021-03-02T14:58:15+05:30 IST