నమ్మండి.. ఇది రహదారే!

ABN , First Publish Date - 2021-05-11T05:06:44+05:30 IST

కురుపాం నియోజకవర్గంలో పెదమేరంగి జంక్షన్‌ వద్ద ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. చినుకు పడితే చాలు... ఈ అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారుతుంది.

నమ్మండి.. ఇది రహదారే!
పెదమేరంగి జంక్షన్‌ లో అంతర్రాష్ట్ర రహదారి దుస్థితి




 జియ్యమ్మవలస, మే 10 :  కురుపాం నియోజకవర్గంలో పెదమేరంగి జంక్షన్‌ వద్ద ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది.  చినుకు పడితే చాలు... ఈ అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారుతుంది. వర్షపు నీరంతా ఆ గోతిలోకి చేరుతుండడంతో  తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.  అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశాలో గుణుపూర్‌, బత్తిలి, సందుబడి, రాయగడ ప్రాంతాలను కలిపే ఈ రోడ్డుతో పాటు  కొమరాడ మండలంలో దెబ్బతిన్న అంతర్రాష్ట్ర రహదారిపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నియోజకవర్గ వాసులు కోరుతున్నారు.

 

 

Updated Date - 2021-05-11T05:06:44+05:30 IST