గుడ్‌ఫుడ్‌ ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-06-21T06:56:51+05:30 IST

జీవక్రియ సరిగా ఉంటేనే మనిషికి ఆహ్లాదం, ఆనందం. కొందరు అతి బరువు పెరగడం వల్ల, రకరకాల అనారోగ్య సమస్యల వల్ల జీవక్రియల రేటు తగ్గుతుంటుంది.

గుడ్‌ఫుడ్‌ ఇలా చేసి చూడండి!

జీవక్రియ సరిగా ఉంటేనే మనిషికి ఆహ్లాదం, ఆనందం. కొందరు అతి బరువు పెరగడం వల్ల, రకరకాల అనారోగ్య సమస్యల వల్ల జీవక్రియల రేటు తగ్గుతుంటుంది. నడక, వ్యాయామంతో పాటు జీవక్రియను పెంచుకోవాలంటే ఈ ఆహారపదార్థాలను తీసుకోవాలి.


కోడిగుడ్లు, మటన్‌, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. జీర్ణం కావటంతో పాటు క్యాలరీలు ఖర్చవుతాయి. శక్తితో పాటు జీవక్రియకు మేలవుతుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే 11 శాతం మెటబాలిక్‌ శాతం పెరుగుతుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్‌ టీ తాగితే కనీసం నాలుగు శాతం నుంచి పది శాతం వరకూ జీవక్రియలరేటు అధికమవుతుంది. మిరపకాయలు తినడం వల్ల కూడా గణనీయంగా మెటబాలిజంలో వృద్ధిరేటు ఉంటుంది. 

Updated Date - 2021-06-21T06:56:51+05:30 IST