ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

వంట చేసేటప్పుడు ఫ్లోరింగ్‌పై పొరబాటున నూనె పడితే ఆ ప్రదేశంలో బియ్యప్పిండి చల్లి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత అక్కడ వేసిన పిండితో ఆ ప్రదేశాన్ని గట్టిగా రుద్ది శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే నూనె మరకలు

ఇలా చేసి చూడండి!

  • వంట చేసేటప్పుడు ఫ్లోరింగ్‌పై పొరబాటున నూనె పడితే ఆ ప్రదేశంలో బియ్యప్పిండి చల్లి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత అక్కడ వేసిన పిండితో ఆ ప్రదేశాన్ని గట్టిగా రుద్ది శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే నూనె మరకలు పోతాయి.
  • వాష్‌ బేసిన్‌ జిడ్డు వాసన వస్తుంటే అందులో బేకింగ్‌ సోడాను చల్లి పదిహేను నిమిషాలపాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత అంట్లు తోమే పీచుతో వాష్‌ బేసిన్‌ని బాగా రుద్ది నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే వాష్‌బేసిన్‌కు అంటుకున్న జిడ్డు పోవడమే కాదు వాష్‌బేసిన్‌ కొత్తదానిలా మెరుస్తుంది. 
  • ఇత్తడి, రాగి చెంబులను ఉప్పు చల్లిన నిమ్మచెక్కతో తోమి, నీళ్లతో శుభ్రంగా కడిగితే కొత్తవాటిల్లా మెరిసిపోతాయి.

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST